నవతెలంగాణ - కోటగిరి
వడ్డీ వ్యాపారుల ఆగడలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ నడుము బిగించింది. సిపి ఆదేశానుసారం శనివారం తెల్లవారుజామున కోటగిరి ఉమ్మడి మండలంలోని పలు వడ్డీ వ్యాపారుల ఇండ్ల పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్లు (0)