నవతెలంగాణ-ఆలేరు-టౌన్
బతుకమ్మ పర్వదినం అంటే ముందుగా గుర్తొచ్చేవి పువ్వులు. పట్టణంలో ఆదివారం నిర్వహించే సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని అన్నిరకాల పూలను వ్యాపారులు మార్కేట్లో సిద్దంగా ఉంచారు. మహిళలు తీరోక పూలు తీసుకువచ్చి, తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతకమ్మ పండగ వేడుకలు పట్టణంలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా గోనుగు పువ్వు, తంగేడు పువ్వు, బంతిపూల వ్మాపారులు మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. గత రెండు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల నుండి వాహనాల్లో పట్టణానికి చేరుస్తున్నారు. బంతిపూలు కేజీ, రూ.50 నుండి, రూ.100, చామంతి రూ.150 నుండి రూ.200, మల్లెపూలు రూ.50 మూర, కనకాంబరాలు రూ.100 వరకు మూర అమ్ముతున్నారు.
అయితే పూలరేట్లు సామాన్యునికి అందుబాటులో లేకపోవడంతో ఆశాజనకంగా వ్యాపారం సాగేట్లేదని వాపోతున్నారు. ఎల్నినో కారణంగా దిగుబడి లేక పూల వ్యాపారం నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం, శుక్రవారం రెండు రోజులు అంగడి నిర్వహిస్తున్నారనీ, దీంతో వ్యాపారం దెబ్బతింటోందని చెబుతున్నారు.
పూల వ్యాపారం ఆశాజనకంగా లేదు: పూల వ్యాపారి లత
"ఆలేరు మార్కెట్లో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆశించిన మేర పుల వ్యాపారం జరగడం లేదు. మార్కెట్లో పూలకు అధిక ధరలు ఉండడంతో కొనుగోళ్ళు సక్రమంగా లేక పూలు పాడై (వాడిపోయి), నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు పట్టణంలో రెండు రోజులపాటు మంగళవారం, శుక్రవారం ప్రజల సౌకర్యార్థం పొరుగురు నుండి వచ్చే వ్యాపారులు అంగళ్ల నిర్వహణతో ఇతర వ్యాపారాలతో పాటు పూల వ్యాపారం కూడా సక్రమంగా జరగడం లేదు. వారంలో ఒకరోజు మాత్రమే అంగడి నిర్వహిస్తే బాగుంటుంది."





కామెంట్లు (0)