•బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బయ్య
నవ తెలంగాణ- మర్రిగూడ
జిల్లాల మధ్యల విభేదాలు సృష్టిస్తూ శివన్నగూడ ప్రాజెక్టు పనులను ఆపడం సరికాదని మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏరుకొండ అబ్బయ్య అన్నారు. బుధవారం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫ్లోరైడ్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మునుగోడు ప్రాంత ప్రజలకు శాశ్వత ప్లారైడ్ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఉద్యమ సమయం లో పాదయాత్రల సందర్భంగా ఈ ప్రాంత పరిస్థితులను కేసీఆర్ పరిశీలించారని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో శివన్నగూడెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులను దాదాపు పూర్తయ్యే దశకు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జిల్లాల మధ్య వివాదాలు సృష్టిస్తూ ప్రాజెక్టును నిలిపివేయాలని ప్రయత్నించడం సరికాదని స్పష్టం చేశారు.
రాజకీయాలు,ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ఆలోచించి,ఫ్లోరైడ్ బాధిత ప్రాంత ప్రజల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు నియోజకవర్గం ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు సమస్య నుంచి ఉపశమనం లభించడంతో పాటు, రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.జిల్లాల మధ్య గొడవలు సృష్టించకుండా, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పగిల్ల.శంకర్,నర్సింహా, మాడ్గుల సాయి, బొల్లోజు శoకర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)