Magazines

సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

1 గంట క్రితం

Make Sarvottam Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-తుంగతుర్తి

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిటి సూర్య యాదవ్ అన్నారు. సోమవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. నేటి వరకు తన నివాసంలో తానే స్వయంగా 100 మంది పట్టపద్రుల ఓట్లను ఎన్రోల్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.


త్వరలోనే మరిన్ని ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు పొందేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఓటరుకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీపడటం లేదని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.


ఉద్యోగ నియామకాలు.. ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పట్టభద్రులకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. మన నియోజకవర్గ ముద్దుబిడ్డ, మూడు జిల్లాలతో సంబంధం గల వ్యక్తి, ఉన్నత విద్యావంతుడైన రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని కార్యకర్తలను వేడుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్