Magazines

ఉప్పల్‌లో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

2 గంటల క్రితం

Programme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – నాచారం: ఉప్పల్ నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగలకూడదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్