Magazines

నిరంతర విద్యుత్‌ అందించకపోతే ఉద్యమమే

1 గంట క్రితం

power supply
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండలంలోని అన్ని గ్రామాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఎప్పడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్ష‍ులు బన్సీలాల్‌ ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్‌ సరఫరా చేయకుండా సస్పెండ్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు విద్యుత్‌ సరఫరా ఆపడం అధికారులది కాదనీ, మీ కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థతే అని ధ్వజమెత్తారు.


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో విద్యుత్‌ మోటార్లు కాలిపోతున్నాయనీ, పంటలు ఎండిపోతున్నాయని, రైతన్నలు మళ్ళీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను కేసీఆర్‌ అందించారని గుర్తు చేశారు. తక్షణమే మండల, రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ల ముట్టడి, పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.


కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాశీనాథ్ పటేల్,  మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావు పటేల్, మండల సర్పంచుల ఫోరం మాజీ  అధ్యక్షులు దారస్ సురేష్.చిన్న షక్కర్గా మాజీ సర్పంచ్ గఫర్. షాకపూర్ మాజీ సర్పంచ్  ఎమ్.కే పటేల్, మండల నాయకులు వెంకట్ కాలే రూసేగావ్ గ్రామ ఉప సర్పంచ్, మద్నూర్ మండల ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు మహేష్, మద్నూర్ మండల యువ నాయకులు వాగుమరే మారుతి, సబేర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్