Magazines

వృద్ధులకు భరోసా ఏదీ.?

1 గంట క్రితం

assurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

మండలంలో 57 ఏళ్లు నిండిన వారు వెయ్యికి పైచిలుకు

ఏడేళ్లుగా తప్పని ఎదురుచూపులు

నవతెలంగాణ - మల్హర్ రావు

కొత్త పింఛన్ల కోసం వృద్ధులు నిరీక్షిస్తున్నారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్నాం పింఛన్ ఇచ్చి ఆదుకోండి మహాప్రభో అంటూ నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసినా, వీరికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా 3680 మంది వివిధ పింఛన్దారులుండగా, ఇటీవల కొత్తగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులకు సంబంధించి నూతనంగా మరో 496 పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.


వృద్ధాప్య పింఛన్లు మాత్రం మరిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో ఎన్నికల్లో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్యం పింఛన్లు ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చింది. నాటి నుంచి ఇప్పటివ రకు 7 ఏళ్లు గడుస్తున్నా కొత్తవారికి మంజూరు చేయడం లేదు. దీంతో ఏటా దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కొత్తగా 496 కొత్త పింఛన్లను మంజూరు చేసిన పాలకులు గ్రామాల వారీగా పంపిణీ చేశారు. కానీ వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించకపోవటంతో వారు ఆందోళన చెందుతున్నారు.


మండలంలో 3680 మందికి పింఛన్లు

మండలంలో అన్ని రకాల పింఛన్లు కలిపి 3,680 ఉండగా, ఇటీవల కొత్తగా 496 నూత నంగా పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో ఈ సంఖ్య 4176 కు చేరింది. 2019లో 57 ఏళ్లు నిండిన వారిని అర్హులుగా చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అంతకు ముందు 65 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చేవారు. గడిచిన 7 ఏళ్లుగా పాలకులు వృద్ధులను పూర్తిగా మరిచిపోయారు. అందరిలాగా తమకు సైతం పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్