Magazines

మున్నూరు కాపు కులస్తులపై అసభ్య దూషణలు.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

4 రోజుల క్రితం

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – కుభీర్: మున్నూరు కాపు కులస్తులను కించపరిచేలా అసభ్య పదజాలంతో దూషిస్తూ, తరచూ గొడవలకు పాల్పడుతున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్నూరు కాపు సంఘం నాయకులు పోలీసులను కోరారు. ఈ మేరకు ఆదివారం కుభీర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డికి ఫిర్యాదు అందజేశారు.

పార్డి (బి) గ్రామానికి చెందిన కర్నెవర్ భోజన్న మద్యం సేవించి తరచూ మున్నూరు కాపు కులస్తులతో గొడవలకు దిగుతూ, కులాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నాడని సంఘం అధ్యక్షుడు శంకర్ ఆరోపించారు. ఈ నెల 1న గ్రామ బస్టాండ్ సమీపంలోని మందిరం గదిలో పలువురు కూర్చుని ఉండగా, మున్నూరు కాపు కులస్తులతో పాటు మహిళలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో పలుమార్లు గ్రామ పెద్దలు, కులపెద్దలు నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. వ్యక్తిగత వివాదాలను కులాల మధ్య చిచ్చుగా మార్చేలా వ్యవహరించడం సరికాదని, గ్రామంలో శాంతియుత వాతావరణం కాపాడేందుకు పోలీసులు విచారణ జరిపి బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫిర్యాదు అందజేసిన వారిలో స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్ , తూము రాజేశ్వర్, గుడాల రాజలింగు, కానోబా, నర్సయ్య, శంకర్ రాజు, రాజేశ్వర్, దత్తు తదితర మున్నూరు కాపు సంఘ సభ్యులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్