పాల్వాయి స్రవంతి రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు
నవతెలంగాణ - చండూరు
దివంగత రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి చేసిన సేవలు ఎన్నటికి మరవలేనివని ఆయన తనయురాలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన 90వ జయంతిని చండూరులో బీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, బీఆర్ఎస్ మండల కీలక నేత,మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేకర్, ముఖ్యనేత తేలుకుంట్ల జానయ్య, కౌన్సిలర్ కొన్రెడ్డి మధు, సామ యాదిరెడ్డి, తేలుకుంట్ల చంద్రశేకర్, మాజీ కోఆప్షన్ రావిరాల నగేష్, ఇరిగి రామన్న, తాడిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)