Magazines

నేటి నుంచి అంబేద్కర్‌ యూనివర్సిటీ పీజీ తరగతులు ప్రారంభం

3 గంటల క్రితం

PG classes at Ambedkar University begin today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ: డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పీజీ మొదటి, మూడో సెమిస్టర్‌ తరగతులు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరానికి చేరిన విద్యార్థులు తమ సంబంధిత అధ్యయన కేంద్రాల్లో తరగతులకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ www.braouonline.in లేదా సంబంధిత అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్