Magazines

అందె డప్పు భాస్కర్ ఉస్తాద్‌కు ప్రతిభా కీర్తి పురస్కారం

11 నిమిషాల క్రితం

'Pratibha Keerthi Puraskar' for Ande Dappu Bhaskar Ustad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- నవంబర్ 25న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం


నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణ జానపద సాహిత్య, కళారంగానికి విశేష సేవలందిస్తున్న ప్రముఖ డప్పు కళాకారుడు, పరిశోధకుడు, రచయిత అందె డప్పు భాస్కర్ ఉస్తాద్‌కు ప్రతిష్ఠాత్మక ప్రతిభా కీర్తి పురస్కారం లభించనుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సాహిత్య, కళారంగాల్లో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. నవంబర్ 25న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.


తెలంగాణ డప్పు కళకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో భాస్కర్ ఉస్తాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దళిత జానపద కళా సంప్రదాయాల పరిరక్షణతో పాటు డప్పు కళపై పరిశోధనలు, రచనలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. గ్రామీణ, అణగారిన వర్గాలకు చెందిన యువతకు డప్పు కళలో శిక్షణ అందిస్తూ సంప్రదాయ కళా వారసత్వాన్ని భావితరాలకు అందిస్తున్నారు.


ఇప్పటికే సంగీత నాటక అకాడమీ అందించిన ప్రతిష్ఠాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందుకున్న భాస్కర్ ఉస్తాద్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 30 మంది సభ్యులతో కూడిన తెలంగాణ డప్పు కళాబృందానికి నాయకత్వం వహించి రాష్ట్ర కళా వైభవాన్ని చాటిచెప్పారు. మలేషియా, అబుదాబి, దుబాయ్, న్యూజిలాండ్ తదితర అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ డప్పు కళా ప్రదర్శనలతో విశేష గుర్తింపు సాధించారు.


ఒకవైపు కళాకారుడిగా, మరోవైపు పరిశోధకుడిగా, రచయితగా తెలంగాణ జానపద కళా సంపద అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి విశ్వవిద్యాలయం గుర్తింపునిస్తూ ప్రతిభా కీర్తి పురస్కారాన్ని ప్రకటించడం పట్ల సాహితీవేత్తలు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం తెలంగాణ జానపద కళారంగానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్