ఇరాన్‌పై నిష్కారణమైన అనవసరమైన యుద్ధం, ఇప్పుడు అనిశ్చిత స్థితిలో వుండిపోతున్నది. ఫలితంగా పెరిగిన చమురు ఇంధన ధరలు, ఇప్పటికే ఉన్న కొనుగోలు శక్తి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇవన్నీ ఎన్నికలలో రిపబ్లికన్లను మరింత దెబ్బతీశాయి. ఆ ‘భూతం’ మన సమకాలీన ప్రపం చాన్ని మళ్లీ వెంటాడబోతున్నదా? ఇప్పుడే అలా అడగడం అతిశయమే అవుతుంది. కానీ విస్మరించలేని విషయం ఏమిటంటే, ప్రతి చోటా మితవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు పరస్పరం పెనవేసుకుపోయాయి. గత మూడు దశాబ్దాలకు పైగా నెలకొన్న నిరాశాజనకమైన వాతావరణం మారిపోతున్నది. కొత్త గాలులు వీస్తున్నాయి. ‘‘ఇది అత్యంత దారుణమైన కాలం, అత్యంత ఉత్తమమైన కాలం కూడా. ఇది అసంతృప్తి నిండిన శీతాకాలం, ఆశలు చిగురిస్తున్న వసంతకాలం కూడా ఇదే.’’ చార్లెస్ డికెన్స్ రాసిన ప్రసిద్ధ వర్ణనకు ఇది సరిపోతుంది.
అంటే స్పష్టంగా చెప్పాలంటే, 1990ల ప్రారంభం నుండి పచ్చి మితవాద శక్తులు తీవ్ర పరాజయ పరిస్థితిని ఇది బలంగా చాటుతున్నది. అయితే అంతమాత్రన బలాబలాలు మొత్తం మారిపోయాయని నిర్ధారించడం తేలికైన పైపై వ్యవహారమవుతుంది. అయితే సెర్బియాలో సృజనాత్మక విద్యార్థి ఉద్యమం నుండి ఉద్భవిస్తున్న నూతనోత్సాహాన్ని, ఆశాజనక సంకేతాన్ని గుర్తించకపోవడం కూడా అంతే అమాయకత్వం అవుతుంది. ఈ ఉద్యమం, పదిహేనేండ్లుగా ఏలుతున్న నడుపుతున్న అలెగ్జాండర్ వుచిచ్ కర్కోటక నియంతృత్వ రాజ్యాన్ని ఒక్కసారిగా పెకిలించి వేసింది. బ్రెజిల్ ఎన్నికల్లో అధ్యక్షుడు లూలా, వామపక్షాలు అద్భుత విజయం సాధిస్తే అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ సర్కారుకు మధ్యంతర ఎన్నికల్లో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. అలాగే తానేదో అజేయుడననుకున్న బెంజమిన్ నెతన్యాహు మట్టిగరవాల్సి వచ్చింది. ఇవన్నీ పై మార్పునకు సంకేతాలే. ఖండాంతరాల వ్యాపితంగా జరుగుతున్న ఈ మార్పులను మనం తేలిగ్గా తీసిపారేయడం వాస్తవాన్ని గుర్తించలేకపోవడమే అవుతుంది.
సోవియట్ యూనియన్ కుప్పకూలడం, హద్దూ ఆపూ లేకుండా ఏకధ్రువ ప్రపంచాన్ని రుద్దడం-మితవాద శక్తులు మరోసారి పైకి లేవడానికి కారణమైనాయనేది స్పష్టమే. సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో కూడిన ఈ మితవాద శక్తుల దూకుడు అన్ని చోట్లా తోసుకువచ్చింది.
చరిత్రాంతం? ఆగని సంక్షోభం!
అయితే, ఈ పరిణామం అన్ని దేశాల్లో ఒకేలా జరగలేదు. ఆయా దేశాల్లో నయా ఉదారవాద విధానాలు అనుసరించిన తీరును బట్టి రకరకాలుగా నడుస్తున్నది. అమెరికా నేతృత్వం లోని సామ్రాజ్యవాదం పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించిన కాలం, ఫ్రాన్సిస్ ఫుకుయామా పేర్కొన్నట్లుగా ‘చరిత్రాంతం’ అనే పరి స్థితి తెచ్చింది. అయితే సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం చారిత్రకంగా, అంతర్గతంగానే సంక్షోభ భరిత వ్యవస్థలు. ద్రవ్య పెట్టుబడి విపరీతంగా కేంద్రీకృతమై, అంతర్జా తీయ ద్రవ్య పెట్టుబడిగా సంలీనమైనప్పుడు దానికి అది తీవ్ర అవరోధాన్ని ఎదుర్కోవడం అనివార్యం. అంతేలేని నిరుద్యోగం, అసమానతల పెరుగుదల శ్రామిక వర్గాన్ని, అణగారిన వర్గాలను అతి దారు ణంగా దెబ్బతీశాయి. కానీ మరోవైపున సమకాలీన పెట్టుబడిదారీ వ్వవస్థ నిరాటంకంగా దూసుకుపోయే పరిస్థితి కూడా లేకుండా చేశాయి. రుణ పరపతి విపరీతంగా పెంచే వ్యూహం ఫలితంగా తన్నుకొచ్చిన 2008 ఆర్థిక సంక్షోభం నిజానికి నయా ఉదారవాద పండితులెవరూ పెద్దగా ఊహించని ఒక విపత్తు.
బెడిసికొట్టిన వ్యూహాలు
ప్రైవేటు అప్పులను ప్రభుత్వ అప్పులుగా మార్చే ప్రక్రియతో దీన్ని ఎదర్కొవాలని ఆ తర్వాత చేసిన ప్రయత్నం కూడా అసమానతలను మరింత పెంచింది. ఇక ఎప్పటిలా రాజకీయ పాలన కొనసాగజాలదని కూడా స్పష్టమైంది. శ్రామిక ప్రజల సాధారణ ప్రజాస్వామ్య స్వేచ్ఛను అట్టిపెట్టేట్టయితే వారిపై ఈ ఆర్థిక దిగ్బంధం కొనసాగించడం సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. మితవాద నిరంకుశ పాలనలు, అస్తిత్వ గుర్తింపు రాజకీయాలపై ఆధారపడిన తీవ్రమైన, ద్వేషపూరిత రాజకీయాలు, పరాయివారంటూ దూరం పెట్టే విధానాలు ప్రధాన లక్షణాలుగా రూపుదాల్చాయి. హంగరీలో ఓర్బాన్, సెర్బియాలో వుచిచ్, టర్కీలో ఎర్డోగాన్, ఇజ్రాయిల్‌లో నెతన్యాహు, భారతదేశంలో మోడీ, గత దాదాపు రెండు దశాబ్దాలలో ఈ సరికొత్త పచ్చి మితవాద నమూనాకు సాక్ష్యంగా నిలిచాయి. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ సమకాలీన చరిత్రలోని ఈ తీవ్రమైన, తిరోగమన దశకు పతాకధారుగా ముందుకు రావడం సరేసరి.
కానీ ఎన్నికలలోనూ, వీధులలోనూ దీనికిప్పుడు పగ్గం పడింది. ఒక అలజడి నెలకొంది. ఐరోపా అంతటా ఈ ఉద్యమం ఊపందుకుంది. ఫ్రాన్స్‌లో విద్యార్థులు తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేశారు. పారిస్ ఇతర ముఖ్య నగరాల వీధుల్లో అంతర్జా తీయ గీతం, 'బెల్లా సియావో' పాటలు ప్రతిధ్వనిం చాయి. విద్యా సంస్కరణలు, విద్య అందుబాటు ధరలు, ఉపాధి అవకాశాలు, సాధికారత వంటి అంశాలతో వారు ప్రారంభిం చారు. వాస్తవానికి, ఫ్రెంచ్ విద్యార్థులు వ్యక్తం చేసింది... కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న ఒక విస్తృత సంక్షోభానికి కేవలం ఒక వ్యక్తీకరణ మాత్రమే. అందువల్ల, ఫ్రెంచ్ ప్రజా ఉద్యమం ఇప్పుడు ముగింపు మాటే లేని దశకు చేరుకుంది.
విశ్వ వ్యాపితమై...
ఇక ఈ సంకేతం అందుకుని ఐరోపా మొత్తం నిప్పంటుకుంది. ఐస్లాండ్ నుండి అల్బేనియా వరకు, స్పెయిన్ నుండి బెల్జియం వరకు, ఇటలీ నుండి హాలండ్ వరకు దావానలంలా వ్యాపిస్తున్నది. అసమానతలు భరించలేని స్థాయికి చేరడం, కొనుగోలు ఘోరంగా పడిపోవడం ఈ పరిణామాలన్నింటికి మూల కారణం. ఆసక్తికరంగా, పచ్చి మితవాద పునరుద్ధరణ పోకడలతో ముడిపడి ఉన్న ద్వేషపూరిత రాజకీయాలు, యూరప్ అమెరికా అంతటా వలసదారులపై దుర్మార్గపు ప్రచారం, మరీ ముఖ్యంగా ట్రంప్ హయాంలో అమెరికా వత్తాసుతో ఇజ్రాయిల్ గాజాలో సాగించిన మారణకాండతో పాటే ఆసక్తికరమైన పరిణామం ఏమంటే-ఇవే మరోవైపున గాజా, పాలస్తీనాల పట్ల ఉత్సాహభరితమైన సంఘీభావం ప్రకటించే సమాంతర సృజనాత్మక భావనలకు ప్రేరణను అందించాయి. వివిధ అస్తిత్వ బృందాలకు చెందిన ప్రజల, ముఖ్యంగా యువత యొక్క పెరుగుతున్న ఐక్యతను కూడా పటిష్టం చేసింది. ఇది, ఇప్పుడు సాధారణంగా జెన్-జి అంటున్న యువత చైతన్యవంతమైన క్రియాశీలతకు ఒక కొత్త ప్రపంచ కోణాన్ని జతచేసింది.
జెన్ జీ పోరాటాలు.. జనం తీర్పులు..
ఈ విస్తృత నేపథ్యం సెర్బియా ఎన్నికలలో ప్రతిబింబించింది. అక్కడ గత రెండేండ్లుగా అవిశ్రాంతంగా సాగిన విద్యార్థి ఉద్యమం ముందు వుచిచ్ నోరు మాతపడింది. కేవలం విద్య, అవకాశాల సమస్యలను మాత్రమే కాదు, అవినీతి, నిరంకుశత్వాన్ని కూడా సవాలు చేయడమే మొదట ఈ ఉద్యమానికి ఆజ్యం పోసింది. నూతన తరహా ప్రజాస్వామ్య సమీకరణ పద్ధతులతో ఈ విద్యార్థి ఉద్యమం స్వీయశక్తితో సంఘటితమై, వుచిచ్ తిరోగమన పాలనకు ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించగలిగింది. విద్యార్థుల జాబితాలోని అభ్యర్థుల చేతిలో ఆ పాలన ఓడిపోయింది. చిరకాలంగా పాతుకుపోయిన రాజకీయ నాయకులుగాక మేధావులు, వృత్తి నిపుణులతో కూడిన ఈ జాబితా నెగ్గింది.
ఇజ్రాయిల్ ఎన్నికలు యూదు జాత్యహంకార రాజకీయాల పరిమితులను స్పష్టం చేశాయి. ఇజ్రాయిల్ సమాజానికే గొప్ప నష్టం జరిగింది. అక్కడ జుడాయిజం స్థానంలో జియోనిజం ప్రవేశించడం సమాజంలోని విస్తార వర్గాలను ఆవరించింది. కానీ, మొత్తం ప్రాంతాన్ని నిరంతర సంఘర్షణలోకి నెట్టిన ఈ ప్రక్రియ నీచత్వం, సమాజంపై, ప్రజలపై, వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు, రెండు అరబ్ రాజకీయ శక్తుల నాయకత్వంలో పాలస్తీనియన్లు దృఢ సంకల్పంతో పోరాడారు. వారితో ఏదో ఒక అవగాహన లేకుండా ఇజ్రాయిల్‌లో ఏ ప్రభుత్వమూ నిలబడలేనంత స్థాయికి ఎన్నికల మద్దతును పొందగలిగారు. ట్రంప్, ఆయన మెగా రాజకీయాలను పెద్ద ఎత్తున వెనక్కు కొట్టడం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పరిణామమే. సెనేట్, కాంగ్రెస్ రెండింటిల్లోనూ రిపబ్లికన్లు తమ మెజారిటీని కోల్పోయారనే వాస్తవం ట్రంప్ ఏకపక్షవాదాన్ని మరింత బలహీనపరుస్తుంది.
భూతం పునరాగమనం?
ఇరాన్‌పై నిష్కారణమైన అనవసరమైన యుద్ధం, ఇప్పుడు అనిశ్చిత స్థితిలో వుండిపోతున్నది. ఫలితంగా పెరిగిన చమురు ఇంధన ధరలు, ఇప్పటికే ఉన్న కొనుగోలు శక్తి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇవన్నీ ఎన్నికలలో రిపబ్లికన్లను మరింత దెబ్బతీశాయి. ఆ ‘భూతం’ మన సమకాలీన ప్రపంచాన్ని మళ్లీ వెంటాడబోతున్నదా? ఇప్పుడే అలా అడగడం అతిశయమే అవుతుంది. కానీ విస్మరించలేని విషయం ఏమిటంటే, ప్రతి చోటా మితవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు పరస్పరం పెనవేసుకుపోయాయి.
జీవనోపాధి సమస్యలపై పోరాటాలను ఎప్పుడూ కొనుగోలు శక్తి సంక్షోభం అంటుంటారు. ఇది వివిధ అస్తిత్వ బృందాల ఐక్యతతో సమ్మిళిత భవిష్యత్తుతో పెనవేసుకుపోతోంది. ఇది అన్ని ఎన్నికల ఫలితాలలోనూ ప్రతిబింబిస్తున్నది. లూలా అయినా లేదా బెర్నీ సాండర్స్ అయినా ఎన్నికలలో విజయం సాధించడం అనేది ఒక విషయాన్ని నొక్కి చెబుతున్నది. సమానత్వం, ఉపాధి, న్యాయం, సమ్మిళిత భవిష్యత్తు కోసం ప్రజలు చేసే పోరాటాల నుండి ఎన్నికల విజయాలను విడదీయరానిదిగా గట్టిగా చాటుతున్నాయి.
(నవంబర్ 11 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)






కామెంట్లు (0)