- పగటిపూటే చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నవతెలంగాణ - అశ్వారావుపేట
అద్దె ఇంటి తాళం పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు రూ.40 వేల నగదును చోరీ చేసిన ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
ఎస్ హెచ్ ఓ ఎస్సై సాయి కిశోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలపల్లి ప్రభావతి జంగారెడ్డిగూడెం రోడ్డులోని పేపర్ బోర్డు ఎదురుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 21) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ఇంటికి తాళం వేసి ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు బయట తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని వస్తువులను చిందరవందరగా వెతికి, సెల్ఫ్‌లో దాచిన సుమారు రూ.40 వేల నగదును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






కామెంట్‌లు (0)