- రూ.45,820 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం
- మరో నలుగురు పరారీ
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూద స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అశ్వారావుపేట అదనపు ఎస్ఐ దేవ్ సింగ్, పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు గుర్రాల చెరువు గ్రామ శివారులో చిత్తు బొత్తు ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు.
ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.45,820 ల నగదు, రెండు సెల్ఫోన్లు, రెండు రూపాయి కాయిన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అశ్వారావుపేట మండలంలో ఎవరైనా జూద స్థావరాలు నిర్వహించినా, జూదంలో పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






కామెంట్లు (0)