Magazines

తప్పుల తడకగా..డేంజర్ జోన్ జాబితా.?

20 నిమిషాల క్రితం

dangers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

ఆందోళనలో భూ నిర్వాసితులు

నవతెలంగాణ-మల్హర్ రావు

పన్నెండేళ్ళుగా తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు 500 మీటర్ల దూరంలో నివసిస్తున్న భూ నిర్వాసితుల సమస్య సోమవారం రెవెన్యూ, జెన్కో అధికారులు  నిర్వహించనున్న  ప్రజాభిప్రాయ భూ సేకరణ గ్రామసభతో కొలిక్కి రానుందని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో ప్రిలిమినరి నోటిఫికేషన్ ఆమోదం తెలిపినప్పుడు 2,472 ఇండ్లను ప్రచురించిన క్రమంలో ఆదివారం రెవెన్యూ, జీపీ సిబ్బంది మాత్రం 847 ఇండ్ల 147 పేజీలు జాబితాను పాత గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గోడకు అతికించారనే సమాచారం తెలియగానే భూ నిర్వాసితులు జీపీ కార్యాలయం వద్దకు పరుగులు తీసుకుంటూ వెళ్లి తమ పేర్లను పరిశీలించారు.


అందులో కొందరి పేర్లు రాలేదని ఆయామయానికి గురైయ్యారు. తమ ఇండ్లకు అన్ని రకాల అర్హతలున్నవి, పెళ్లిళ్లు కానీ, అయిన వారి పేర్లు రాలేదని తాము మేజరైన రాకపోవడంతో ఆందోళనకు గురివుతున్నారు. ఇది కేవలం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే అభ్యంతరాలను ప్రజాభిప్రాయ సేకరణలో తెలియజేయాలని, ఎవరు ఆందోళన చెందడవద్దని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. అలాగే అధికారులు ప్రచురించిన జాబితాను పిడిఏప్ రూపంలో ఇవ్వాలని పలువురు యువత నిర్వాసితులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్