పట్టించుకోని అధికారులు.. ఇబ్బందులో ప్రజలు
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని బెల్గాంతండాలో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామంలో మురికి కాలువల గుండా చెత్త పేరుకుపోయింది. దీంతో నీరు రోడ్లపై పారి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకై సర్పంచ్ చొరవ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్మికులు నెలనెలా జీతాలు తీసుకుంటున్నా పనులు మాత్రం అరకొరగానే చేస్తున్నారు. గ్రామంలో జరిగే పనులను చూసే కార్యదర్శి కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాడు. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో లక్షలు ఖర్చు చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు అవి పూర్తగా నిరూపయోగంగా మారాయి. వాటిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకొని నిరుపయోగంలో ఉన్న వాటిని వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.





కామెంట్‌లు (0)