Magazines

సిరియాలో కారు బాంబు పేలుడు.. చిన్నారి సహా ఇద్దరు మృతి

2 గంటల క్రితం

syria blast
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సిరియా రాజధాని డమాస్కస్ దక్షిణ శివారు ప్రాంతమైన జరమానాలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీ సమీపంలో కారులో అమర్చిన పేలుడు పదార్థం శనివారం సాయంత్రం పేలింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. సిరియా ప్రభుత్వ టీవీ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించాయి. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్