నవతెలంగాణ-హైదరాబాద్ : అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ మరో చరిత్ర సృష్టించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన డబుల్ క్యాచ్ ప్రయోగం విజయవంతమైంది. భారీ స్టార్‌షిప్ వ్యోమనౌక రోదసి నుంచి తిరిగి భూమికి చేరుకొంది. లాంచ్ ప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ మెకానికల్ చేతులు వ్యోమనౌకను ఒడిసిపట్టాయి. ఆర్టెమిస్ మిషన్లకు స్టార్‌షిప్ ప్రయోగాలు అత్యంత కీలకమని స్పేస్ ఎక్స్ పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మస్క్ హర్షం వ్యక్తం చేస్తూ టీమ్‌ను అభినందించారు.
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్..డబుల్ క్యాచ్ ప్రయోగం విజయవంతం
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)