Magazines

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఏఐసీసీ బాస్..

5 గంటల క్రితం

dm sandeep
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఏఐసీసీ (AICC) ఇన్‌చార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన కుమారి మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్‌కు పార్టీ అధిష్టానం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా, పదవీ విరమణ చేస్తున్న ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీకి అందించిన విశేష సేవలను కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అభినందించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్