Magazines

గ్రామ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులదే కీలక పాత్ర

1 గంట క్రితం

Jarpula Bhaskar Naik
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

కొత్తపల్లి సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు

నవతెలంగాణ-మిడ్జిల్ 

గ్రామ పంచాయతీ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని మండల పరిధిలోని కొత్తపల్లి సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు అన్నారు. దీపావళిని పురస్కరించుకొని స్వచ్ఛంద సేవకులు జరుపుల భాస్కర్ నాయక్, టీం సభ్యులు రాగుల రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికులకు (లాలూ, బచ్చమ్మ, ఈదమ్మ, వెంకటమ్మ, బామ్ని, మరియు డీలర్ అమీరుద్దీన్, అంగన్వాడీ టీచర్ పొన్నవి, శారద , మంజుల, మరియు ఆశ వర్కర్ స్వర్ణలత, బుక్ కీపర్ భాగ్య, ప్రాథమిక పాఠశాల స్పీపరు రాములు, వంట మనిషి ఇందిరమ్మ గ్రామంలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి) నూతన వస్త్రాలను, స్వీట్ బాక్స్లు సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు అందజేశారు.


ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండనక, వాననక నిత్యం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి సేవలను గుర్తించి పండుగ పూట కొత్త బట్టలు అందించడం   

ఎంతో అభినందనీయమని దాత జరుపుల భాస్కర్ నాయక్‌ను ప్రశంసించారు. రాగుల రమేష్ మాట్లాడుతూ..సమాజం కోసం కష్టపడే కార్మికుల ముఖాల్లో ఆనందం చూడటమే నిజమైన దీపావళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతయ్య, వార్డ్ మెంబర్స్ మహేష్ , పాండు మల్లీశ్వరి, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు లావణ్య, తారాసింగ్, రాములు శివగంగ, సురేష్, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్