Magazines

ఐసీఎఫ్ఏ బోర్డులో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శికి కీలక స్థానం

1 గంట క్రితం

Telangana Agriculture Secretary holds key position on ICFA board

Telangana Agriculture Secretary holds key position on ICFA board

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి మరో గౌరవం దక్కింది. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ APC & కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. సురేంద్ర మోహన్, IASను ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA) బోర్డులో ఎక్స్‌-అఫీషియో సభ్యుడిగా నామినేట్ చేశారు.

ఈ మేరకు ICFA డైరెక్టర్ జనరల్ డాక్టర్ తరుణ్ శ్రీధర్, IAS (రిటైర్డ్) 2026 అక్టోబర్ 14న అధికారికంగా నియామక లేఖను జారీ చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కె. సురేంద్ర మోహన్ అందిస్తున్న సేవలు, అనుభవం, నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఈ నామినేషన్ చేపట్టినట్లు లేఖలో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ విధానాల రూపకల్పన, ప్రభుత్వాలకు విధానపరమైన సూచనలు, వాణిజ్య అవకాశాల విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రోత్సాహం, అంతర్జాతీయ భాగస్వామ్యాల అభివృద్ధిలో ICFA కీలక పాత్ర పోషిస్తోంది.


ICFA ఛైర్మన్ ఎస్. సురేష్ ప్రభు ఆమోదంతో చేపట్టిన ఈ నామినేషన్‌కు రెండేళ్ల పదవీకాలం ఉంటుందని, నియామకం నిర్ధారించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారిక లేఖలో వెల్లడించారు. ఈ బాధ్యత పూర్తిగా పాలనాపరమైన, సలహా పాత్రకే పరిమితమని, దీనివల్ల ఎలాంటి చట్టపరమైన లేదా ఆర్థికపరమైన బాధ్యతలు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో విశేష అనుభవం కలిగిన సీనియర్ అధికారికి జాతీయ స్థాయి వ్యవసాయ సంస్థ బోర్డులో స్థానం లభించడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఈ నామినేషన్‌తో తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, రైతుల సమస్యలు, రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలకు జాతీయ స్థాయి విధాన చర్చల్లో మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడింది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్