నవతెలంగాణ – కుభీర్: మండలంలోని ఫార్డి (కె) గ్రామంలోని దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న తాళ సప్తమి వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున కాకడ హారతి నిర్వహించారు. అనంతరం భజన కీర్తనలతో గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. భక్తులు నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగామణి సత్యనారాయణ, రాములు, గ్రామస్తులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)