నవతెలంగాణ – చండూరు
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చండూరు సింగిల్ విండో చైర్మన్ చెరుపల్లి ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం గట్టుపల మండల కేంద్రంలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తహశీల్దార్ రాములుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం 17లోపు ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం క్వింటాల్‌కు రూ.2,461 పొందవచ్చని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విరమల్ల శ్రీశేలం, సర్పంచ్ లు నామని జగన్నాధం, సింగం వెంకటేశం,బిమనపల్లి రామయ్య,కాంగ్రెస్ నాయకులు, కంచుకట్ల సంపత్,ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య,గిరి సత్తయ్య,బాణవాథ్ గంశిరం, అచ్చిన శ్రీనివాస్,బల్రెడ్డి,గిరి శంకర్,చేరుపల్లి చంద్రమోలి,మాధగని విరస్వామి, నామని బుచ్చయ్య, శౌరిల్లు,వెంకటేశం యాదయ్య, గణేష్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)