Magazines

గొప్ప మానవతా గ్రంథం రాజ్యాంగం

1 గంట క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదుల మీద మన దేశాన్ని నిలబెట్టిన మహా గ్రంథం భారత రాజ్యాంగమని దళిత ఐక్య సంఘటన అధ్యక్షులు కాంతయ్య అన్నారు. నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "పుట్టుకతో ఎవరూ గొప్ప కాదు, ఎవరూ తక్కువ కాదు... అందరూ సమానమే, అందరికీ సమన్యాయ చట్టాలను, అందరికీ ఒకే హక్కులు అని చాటి చెప్పిన గొప్ప మానవతా గ్రంథం రాజ్యాంగ"మన్నారు.


కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడికి ఓటు హక్కు, మాట్లాడే హక్కు, గౌరవంగా బతికే హక్కుతో పాటు స్వేచ్చను కల్పించింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమన్నారు. ఆ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి బాధ్యతని గుర్తు చేశారు.


ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన అధ్యక్షులు కాంతయ్య, సిహెచ్ గంగాధర్, మల్లెల లక్ష్మణ్, పర్స నవీన్, గడల లక్ష్మణ్, పత్రి రాజేందర్, బట్టు అనిల్, తుమ్మ రవీందర్, మేకల శ్రీనివాస్, మొండి రాజు, సురేష్ రాజన్న, భూపతి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్