- ముసురు ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
- దమ్మపేట మండలంలోనూ గణనీయమైన వర్షపాతం నమోదు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ముసురు ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన వర్షపాతం గణాంకాల ప్రకారం నవంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అశ్వారావుపేటలో అత్యధికంగా 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వర్షపాతంలో అశ్వారావుపేట అగ్రస్థానంలో నిలిచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం నాయుడుపేటలో 45 మి.మీ., మల్కారంలో 41.8 మి.మీ., అంకంపాలెంలో 33.8 మి.మీ., అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో 31 మి.మీ. వర్షం కురిసింది.
చంద్రుగొండ మండలం మద్దుకూరులో 23.3 మి.మీ., చుంచుపల్లిలో 18.8 మి.మీ., ములకలపల్లిలో 16.5 మి.మీ., కొత్తగూడెంలో 13.3 మి.మీ., దమ్మపేట మండలం మండలపల్లిలో 9.3 మి.మీ., బూర్గంపహాడ్‌లో 9.3 మి.మీ., టేకులపల్లిలో 8.8 మి.మీ., ఇల్లందులో 8.5 మి.మీ., సుజాతనగర్లో 8.5 మి.మీ., జూలూరుపాడులో 7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి తదితర ప్రాంతాల్లోనూ గణనీయంగా వర్షాలు కురిశాయి. సత్తుపల్లిలో 30.3 మి.మీ., వేంసూరులో 39.3 మి.మీ., పెనుబల్లిలో 33.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒకే రోజు స్వల్ప వ్యవధిలో పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదు కావడం గమనార్హం.






కామెంట్లు (0)