Magazines

ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైర్లు చోరీ

4 రోజుల క్రితం

Transformer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – కుభీర్: మండలంలోని పార్డి (బి) గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్లను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధిత రైతు సునుగురు నారాయణ్ ఆదివారం కుభీర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు నీరు పెట్టి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లి చూడగా ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమై, అందులోని కాపర్ వైర్లు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ చోరీతో పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని నారాయణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ మండలంలోని పలు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ చర్యలు లేకపోవడంతో దొంగతనాలు పునరావృతమవుతున్నాయని తెలిపారు. పోలీసులు స్పందించి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్