నేడు సద్దుల బతుకమ్మ పండుగ
నవతెలంగాణ-మల్హర్ రావు
బతుకమ్మ అంటేనే పూల పండుగ.రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా రంగురంగుల పూలతో ఆడపడుచులు త్రికోణాకారంలో బతుకమ్మలు పేర్చడం ఆనవాయి తీగా వస్తోంది.వర్షాకాలం చివరలో,శీతాకాలం ఆరంభంలో జలాశయాలు నిండి, మొక్కలు రంగు రంగుల పూలతో కళ సంతరించుకుంటాయి.ఈ నేపథ్యాన బతుకమ్మ పేర్చేందుకు వాడే ప్రతీ పువ్వులో అందమే కాక ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధగుణాలు కూడా ఇమిడి ఉంటాయి.
తంగేడు... బతుకమ్మకు తలమానికం బతుకమ్మ పేర్చడంలో ముందు వరుసలో తంగేడు పూలు ఉంటాయి.పసిడి వర్ణంలో మెరిసే ఈ పూవు తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడా. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జ్వరం,మలబద్ధకానికి ఇది మంచి మందు.తంగేడు పూలను ఆరబెట్టి, దానిలో ఉసిరికాయ పొడి,పసుపు సమాన భాగాలుగా కలిపి చేసిన మందును ప్రతిరోజూ రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
తామర..
స్వచ్ఛతకు ప్రతీక అందం,స్వచ్ఛతకు ప్రతీక అయిన తామర పూవును రక్తస్రావ నివారణకు వినియోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీలో కూడా వాడతారు.నిద్రలేమి, బద్ధకంతో బాధపడేవారికి తామర తైలం దివ్య ఔషధం.తామర రేకుల పొడిని తేనెలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగు తుంది, మొటిమలు తగ్గుతాయి.
గునుగు..
గడ్డి జాతి అద్భుతం గునుగు (కొన్ని చోట్ల గునుకు,బొంగు పువ్వు) అనేది గడ్డి జాతి మొక్క. బతుకమ్మ అలంకరణలో ఇది ఎంతో శోభనిస్తుంది. విరేచనాలు,అతిసారం నివారణకు మందుగా వాడతారు.ఈ పువ్వు చర్మంపై గాయాలు,పాక్కు లు,క్షయ వ్యాధి నివారణకు కూడా ఉపయోగపడు తుంది.
మరికొన్ని పూలు..
బంతి, చామంతి కంటి చూపును మెరుగుపరచడా నికి,చర్మ వ్యాధుల నివారణకు తోడ్పడతాయి.వీటి వాసన క్రిమి కీటకాలను దూరం చేస్తుంది.నం దివర్ధనం కంటి వ్యాధులకు,జ్వరానికి మంచి మందు.గోరింటాకు పూలు బతుకమ్మ మధ్యలో పెట్టే పూలు,ఆకులు శరీరానికి చలువ చేస్తాయి.సీతమ్మ జడల పూలు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.
పండగ వెనుక సైన్స్..
బతుకమ్మను పేర్చి ఆడేటప్పుడు,పూలలోని ఔషధ గుణాలు గాలిలో కలిసి శ్వాస ద్వారా శరీరంలోకి చేరి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.వర్షాకాలం తర్వాత వచ్చే వైరల్ జ్వరాలను తట్టుకునేలా చేస్తాయి.పూలు పేర్చడం,బతుకమ్మ ఆటపాటలతో మహిళలకు మంచి వ్యాయామం కూడా అవుతుంది.అందుకే బతుకమ్మ కేవలం పూల పండుగే కాదు ప్రకృతిని ఆరాధిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడు కునే సంప్రదాయ వైద్య పండగ అని చెబుతారు.ఈ నేపథ్యంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.







కామెంట్లు (0)