నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిదిలోగల శాత్రజ్ పల్లిలో నిర్మాణం చేపట్టి కూల్చేసిన ఇండ్లతో మండలంలోని కొయ్యుర్ పారెస్టు రేంజ్ కార్యాలయానికి రూ.5.60 లక్షల ఆదాయం వచ్చినట్టుగా పారెస్టు రేంజ్ అధికారి ఎండి ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు.
ఈ సందర్భంగా పాత ఇండ్ల కలపను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు మూడు ట్రాక్టర్లు పట్టుకొని ఒక్కొక్క ట్రాక్టర్ రూ.30 వేల జరిమానా విధించగా, ఇండ్ల నిర్మాణం కోసం అనుమతుల పేరిట అధికారులు ఒక్కొక్క ఇంటికి రూ.10 వేల చొప్పున వసూళ్లు చేసి రసీదుల రూపిన ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 10వ తేదీ వరకు మొత్తం రూ.5.60 లక్షల ఆదాయం సమకూరినట్లుగా తెలిపారు.
చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ఇండ్లు నిర్మాణం చేసిన బాధితుల ఇండ్లు ఈ నేల 11న అర్ధరాత్రి బుల్లోజర్లతో నేలమట్టమైన విషయం తెలిసిందే. బుల్లోజర్ల వీరంగంతో బాధిత ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నష్టం జరగడంతో వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది.




కామెంట్లు (0)