క్షేత్రస్థాయిలో కరువైన చర్యలు
నేటి నుంచే అవగాహన సదస్సులు
నవతెలంగాణ-మల్హర్ రావు
ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.అక్టోబర్ నుంచే భూగర్భ జలమట్టాలు తగ్గు ముఖం పట్టడంతో భవిష్యత్తులో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది.మరోవైపు రబీ సీజన్ లో పంటల సాగుకు సరిపడా నీరు అందుబాటులో ఉంటుందా లేదా అనే సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి.ఎల్నినోపై ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం తగిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.
ప్రకటనలకే పరిమితమా?
నీటిని పొదుపుగా వినియోగించాలని,ముంచుకొస్తున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.అయితే,క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలకు ఇప్పటికీ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు.నీటి కొరతను తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై తగిన సలహాలు,సూచనలు అందించడంలో యంత్రాంగం విఫలమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేవలం ప్రసార మాధ్యమాల ద్వారా సందేశాలకే పరిమితం కాకుండా,ఆ నీటి పొదుపు చర్యలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేలా ఆచరణాత్మక కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అవగాహన తప్పనిసరి
ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించి,భూగర్భ జలాల పరిస్థితి,రబీ సాగు అవకాశాలు,నీటి లభ్యతపై వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా వివరించాల్సిన అవసరం ఉంది.ఆయా ప్రాంతాల నీటి లభ్యత ఆధారంగా,ఒకవేళ సాగునీరు పరిమితంగా ఉంటే తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు రైతులు మళ్లేలా అవగాహన కల్పించాలి.నీటి లభ్యతను సరిగ్గా అంచనా వేయకుండా అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేస్తే,చివరికి పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి.
క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఏదీ?
నీటి కొరత ఏర్పడిన తర్వాత స్పందించడం కంటే,ముందుగానే అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యం.గ్రామాల వారీగా నీటి వనరుల పరిస్థితిని సమీక్షించి,తాగునీటి మరియు వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలి.సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ,ప్రజలకు మరియు రైతులకు అవసరమైన మార్గదర్శకాలు అందించాల్సిన అవసరం ఉంది.ఎల్నినో ప్రభావంపై హెచ్చరికలు వస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన సన్నద్ధత కనిపించకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా,గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు స్పష్టమైన సాగు సూచనలు అందించాలి.
22నుంచి అవగాహన సదస్సులు..
ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొనగా,అక్టోబర్ నెల నుంచే భూగర్భ జలమట్టాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.దీనివల్ల రాబోయే రోజుల్లో తీవ్ర తాగునీటి కొరత ఏర్పడే ముప్పు కనిపిస్తోంది.మరోవైపు,వస్తున్న రబీ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందో లేదోనని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది.ఎల్నినో పరిస్థితులపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని,క్షేత్రస్థాయిలో నీటి ఎద్దడిని నివారించేందుకు తగిన ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







కామెంట్‌లు (0)