Magazines

నర్సింహులగూడెం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం 

08 అక్టోబర్, 2026

Narasimhulagudem
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

తొర్రూరు డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం

విద్యుత్తు డి ఈ కృష్ణ

నవతెలంగాణ-నెల్లికుదురు 

తొర్రూరు డివిజన్ పరిధిలోని మునిగలవీడు సెక్షన్‌లో నిర్మించిన నర్సింహులగూడెం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించినట్లు   డి.ఈ  కృష్ణ తెలిపారు. గురువారం ఏ డి ఈ అశోక్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ  సబ్‌స్టేషన్‌కు లోడ్‌ను తీసుకుని విద్యుత్ సరఫరాను ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు రెండు సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తయిన ఈ సబ్‌స్టేషన్‌ను తాజాగా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు.


దీంతో పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు వినియోగదారులకు మరింత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం ఏర్పడింది అని అన్నాడు.ఈ సబ్‌స్టేషన్ సేవల్లోకి రావడంతో సంబంధిత ప్రాంతంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు, ఫీడర్ల లోడును సమతుల్యం చేసేందుకు దోహదపడుతుంది అని చెప్పారు. ముఖ్యంగా వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక వసతులను ముందుగానే బలోపేతం చేయడంలో ఈ సబ్‌స్టేషన్ కీలకంగా నిలవనుంది అన్నాడు.


ఈ సబ్ స్టేషన్ పరిధిలోకి బంజర ఫీడర్ను మరియు నరసింహుల గూడెం లీడర్ను కలిపి ప్రారంభించడం చెప్పారు. సంబంధిత ఆపరేషన్, సాంకేతిక సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ అశోక్ ఏఈ సాగర్ లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ లైన్మెన్ శోభన్లు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్