Magazines

జాతీయ మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్టు అప్రజాస్వామికం

30 సెప్టెంబర్, 2026

arrests
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

-జాతీయ మాల మహానాడు నెల్లికుదురు మండలం అధ్యక్షుడు కారం ప్రశాంత్ 

నవతెలంగాణ-నెల్లికుదురు

 ఉమ్మడి కరీంనగర్,సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపర్యటన సందర్భంగా శాంతియుతంగా మాలలకు రోస్టర్ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళలని మాల మహానాడు పిలుపు నేపథ్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా జాతీయ మాల మహానాడు నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామికమని జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ అన్నాడు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎవరైతే హక్కుల కోసం పోరాడుతారో న్యాయం చేయాలని ఉద్యమ గొంతు ఎత్తుతే నొక్కేయ్యడమే నా ప్రజాపాలన అని అన్నారు. పేదలకు న్యాయం జరగదా ఈ రాష్ట్రంలో కనీసం సమస్యలపై చెప్పుకునే హక్కు కూడా లేదా అని వారు ప్రశ్నించారు. తక్షణమే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ముఖ్యమంత్రి ప్రతి పర్యటనలో అడుగడుగునా అడ్డుకుంటాం అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్