Magazines

ఎర్రబెల్లి గూడెంలో ఎస్బిఐ మినీ బ్యాంకు ప్రారంభం

2 గంటల క్రితం

SBI Mini Bank launched
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామంలో నెల్లికుదురు ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ తోట ప్రవీణ్ సహకారంతో ఆదివారం నూతన మినీ బ్యాంక్ ప్రారంభమైంది. గడ్డంవేణు సారధ్యంలో సర్పంచ్ ఉష అశోక్ యాదవ్‌లు సంయుక్తంగా ప్రారంభించారు. అంతకుముందు సౌల తండా సర్పంచ్ సుజాత వాసు, బడి తండా సర్పంచ్ ధనమ్మ అమృనాయక్ పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎర్రబెల్లి గూడెం గ్రామంలో ఎస్బిఐ మినీ బ్యాంకు సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం గ్రామస్తుల అదృష్టమన్నారు.


బ్యాంకు సేవలకు జిల్లా, మండల కేంద్రాలకు వెల్లకుండా మన ఊర్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామస్తులకు ఎస్‌బీఐ మిని బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన బ్యాంకు అధికారులకు ప్రత్యేక కృతజ్క్ష‍తలు తెలిపారు. కార్యక్రమంలో బడి తండ సర్పంచ్ ధనమ్మ అమృ నాయక్, సౌళ్ళ తండా సర్పంచ్ సుజాత వాసు,మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య, నాయకులు దేవేందర్ రావు, అశోక్,విజేందర్, గ్రామస్తులు సతీష్ రావు, గడ్డల అశోక్,బాలకృష్ణ, గడ్డం కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్