Magazines

మల్హర్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు

4 గంటల క్రితం

Vijayadashami
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్‌రావు: చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని తాడిచెర్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇప్ప మొండయ్య అన్నారు. మంగళవారం విజయదశమి సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు వివిధ గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో రావణ దహనం, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొండయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. జమ్మి చెట్టును పూజించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రజల సంప్రదాయమన్నారు. రావణ దహనం ద్వారా అహంభావం, దురాశ, అసత్యం వంటి దుర్గుణాలను విడనాడాలనే సందేశం అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బండి స్వామి, జంగిడి శ్రీనివాస్, గడ్డం క్రాంతి, అబ్బినేని లింగస్వామి, బొమ్మ రజిత, రమేష్‌రెడ్డి, కొండ రాజమ్మ, మేకల రాజయ్య, బండారి నర్సింగం, ఉప సర్పంచులు అక్కల దేవేందర్ యాదవ్, బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతిరావు, ఇందారపు చంద్రయ్య, సారయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్