Magazines

ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం నమోదును పరిశీలించిన జెడ్పీ సీఈఓ

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – ఆలేరు రూరల్‌: ఆలేరు మండలంలోని సాయిగూడెం గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ సీఈఓ శోభారాణి శుక్రవారం పరిశీలించారు. రేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబాన్ని పథకంలో నమోదు చేయాలని, అర్హులైన ఏ కుటుంబం మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలో వి.బి.జి. రామ్‌జీ పథకం కింద చేపట్టిన ఫామ్‌పాండ్‌ (వ్యవసాయ క్షేత్ర కుంట) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, ఏపీఓ, ఎంపీఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్