నవతెలంగాణ – కంఠేశ్వర్ : అఖిల భారతీయ పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్, జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి నర్సింలు బలపరిచిన జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఖలీల్ వాడి లోని జిల్లా సంఘ భవనంలో ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా మైసల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు గంగా ప్రసాద్ ఉపాధ్యక్షులుగా గాలిపల్లి నారాయణ, పాము రమేష్, అంకం జగదీష్ గంగుల దత్తాద్రి (ముప్కాల్),ఆరుట్ల రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శిగా దేవ బజరంగ్, పద్మ సుభాష్ ,సాంబారు తిరుపతి (నందిపేట),ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పరపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శిగా కూరపాటి వెంకట్, కోశాధికారిగా దిండిగళ్ళ శంకర్ లను నియమించారు. సలహాదారులుగా డాక్టర్ ఎం శ్రీహరి, డాక్టర్ కె సుభాష్, డాక్టర్ బి కేశవులు, పెంట దత్తాద్రి, గెంట్యాల వెంకటేశం, భీమర్తి రవి, కన్నా శ్రీనివాస్, ఉప్పరపల్లి శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా గర్దాస్ శంకర్, ఆడెపు రాజన్న, విట్టం వెంకటరమణ(నూత్ పల్లి) జట్ల బాలరాజ్ (ఎడపల్లి ),గంజి గణేష్,(నవీపేట్ ),షేర్ పల్లి బాబురావు, గంగుల గంగాదర్, (నంది పేట ),దయానంద్ (హొన్నజిపేట్ ) లను ప్రకటించారు.
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
- Advertisement -
- Advertisement -