Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మంత్రి చే సన్మానించబడ్డ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు 

మాజీ మంత్రి చే సన్మానించబడ్డ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్:  పట్టణంలోని  సిద్దుల గుట్ట  వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద 108 రోజులు 108 గ్రామాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినందుకు  వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డు, గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా శనివారం  మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి  చే సన్మానించబడ్డట్టు పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు.  మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా  అవార్డు గోల్డ్ మెడల్ అందుకున్న  అందుకున్న సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి  జిల్లాలో ఇంకా విస్తృతంగా ధ్యాన శాకాహార విశిష్టతలను వివరిస్తూ గ్రామ గ్రామానికి అవగాహన కల్పించాలని మాజీమంత్రి కోరినారు. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డు గోల్డ్ మెడల్ రావడం ఎంతో గొప్ప విషయమని భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నతంగా ఎదగాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు మానికేశ్వరరావు, పి ఎస్ ఎస్ ఎం జిల్లా ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, సభ్యులు సబ్బానీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -