Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ వైద్య సేవల వినియోగంలో జిల్లా మొదటి స్థానం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

ప్రభుత్వ వైద్య సేవల వినియోగంలో జిల్లా మొదటి స్థానం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను వినియోగించుకోవడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోగ్యం ఆన్లైన్ అప్లికేషన్ నమోదు ర్యాంకు పరిగణలో కామారెడ్డి జిల్లా జూన్ మాసానికి గాను మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ ఆరోగ్యం అనే ఆన్లైన్ అప్లికేషన్ లో రోజువారిగా కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినటువంటి రోగులు, రోగ నిర్ధారణ పరీక్షకు వచ్చినటువంటి ప్రజలు, ఔషధాల నిమిత్తం వచ్చినటువంటి ప్రజల వివరాలను నమోదు చేస్తారన్నారు.

కలెక్టర్  ఆదేశాల మేరకు జూన్ మాసంలో ఈ ఆరోగ్యం అనే ఆన్లైన్ అప్లికేషన్ కామారెడ్డి జిల్లాలోని 22 ప్రభుత్వ ఆస్పత్రిలలో నమోదు అయిన వివరాలు, ఆస్పత్రిని చికిత్స నిమిత్తము సంప్రదించినటువంటి ప్రజలు 25152, డాక్టరు ను సంప్రదించినటువంటి ప్రజలు 23723, రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకొన్నటువంటి ప్రజలు 5232, ఔషధ సేవలను 21539 మంది వినియోగించుకున్నారు.

ఈ గణాంకాల ప్రకారం సగటున ఒక రోజుకి 1007 మంది ప్రజలు కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వాసుపత్రిల సేవలను వినియోగించుకున్నారు. సగటున ఒక్కొక్క ఆస్పత్రిని ఒక్కొక్క రోజు సుమారుగా 46 మంది ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రిని వినియోగించుకున్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో జూన్ 2025 మాసానికి వెలువడించిన జిల్లా ర్యాంకులలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. కావున కామారెడ్డి జిల్లాలోని ప్రజలందరూ తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రిని, ఆస్పత్రి సేవలను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సoగ్వన్,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ జిల్లా ప్రజలను  కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -