నవతెలంగాణ – కంఠేశ్వర్
హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్ వర్క్ షాప్ లో నగరానికి చెందిన ఎల్ ఎస్ ఎస్ ప్రసాద్ తీసిన యూట్యూబ్ షార్ట్ ఫిలిం ను ప్రదర్శించారు. డైరెక్టర్ సందీప్ శాండిల్య సమాజంలో యువతకు ఎంతో ఉపయోగపడే చక్కటి షార్ట్ ఫిలిం తీసినందుకు ఎల్ ఎస్ ఎస్ ప్రసాద్ ను ఆతనికి సహకరించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ విజయానంద్ ను డైరెక్టర్ అభినందించారు. కార్యక్రమం లో నార్కోటిక్స్ ఎస్ పి సీతారాం, ఏసీపి కృష్ణ మూర్తి, సిఐ శ్రీనివాస్ రావు, లయన్స్ డిస్ట్రిక్ట్ -హెచ్ గవర్నర్ గంప నాగేశ్వర రావు ఇంపాక్ట్, లయన్స్ సభ్యులు, పాలిటెక్నిక్ బోధన సిబ్బంది పాల్గొన్నారు.
వర్క్ షాప్ కు హాజరైన జిల్లావాసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES