Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeనల్లగొండప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు

ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు

- Advertisement -

నవతెలంగాణ-వలిగొండ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా గ్రామీణ కళాకారులను ఆదుకుంటామని వారికి గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు  ఇస్తామన్న ప్రకటన చేసి నేటికీ రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా  కళాకారులను గుర్తించకుండా విస్మరిస్తుందని ఇప్పటికైనా కళాకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు డిమాండ్ చేశారు ఆదివారం రోజున వలిగొండ మండల కేంద్రంలో ప్రజాసంఘాల కార్యాలయంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గంటేపాక శివకుమార్  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కళాకారులకు అనేక రకాల హామీలు ఇచ్చిందని అందులో భాగంగా గ్రామీణ కళాకారులను ఆదుకుంటామని వారికి ఇల్లు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి నేడు వాటిని విస్మరించిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే  కళాకారులను గ్రామీణ స్థాయిలో గుర్తించి వారందరికీ గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని, పెన్షన్  ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం కేవలం కొంతమంది కళాకారులను మాత్రమే గుర్తించి వారి పరిపాలనలో భాగస్వామ్యం చేసుకుందని అనేకమంది కళాకారులు అనేక ప్రజాఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు, జానపద  డప్పు కళాకారులు అనేకమంది ఉన్నారని వారందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వం కళాకారులను గుర్తించి మండల స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వలిగొండ మండల కేంద్రంలో కళాకారుల భవనాన్ని ఆధునికరించాలని, ప్రభుత్వ ఆధీనంలో భవనాన్ని నడపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి ఐలయ్య, సహాయ కార్యదర్శి దేశపాక రవి, ఉపాధ్యక్షులు గుండు నరసింహ, సహాయ కార్యదర్శి కొల్లూరి శ్రావణి,  జిల్లా కమిటీ సభ్యులు బండారు మనీషా, పిట్ట గాలయ్య, గడ్డం పాండురంగం, సంఘపాక స్వామి, బొల్లెపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad