Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
వడ్లూర్, ఎల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్, గోకుల్ తండా, రామారెడ్డి  గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత సందర్భంగా, సదాశివనగర్ మండల పరిధిలోని వడ్లూర్ – ఎల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్, గోకుల్ తండా, రామారెడ్డి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర  ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ఓటు హక్కు వినయోగించుకున్న వృద్ధులతో ముచ్చటించిన జిల్లా  ఎస్పీ  పోలింగ్‌ బందోబస్త్ పరిశీలనకు వెళ్ళిన  ఎస్పీ కి ఒక వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకొని అలసటతో కొద్ది దూరములో కూర్చున్నది. అది గమనించి ఆమె వద్దకు వెళ్ళి మాట్లాడి ఓటు హక్కు వినియోగంపై వారి అనుభవాలను తెలుసుకున్నారు.  నడిచే ఓపిక లేకున్నా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వృద్దులకు  స్వయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు.  

సదాశివనగర్‌లో  సదాశివనగర్ పోలింగ్ కేంద్రంలో ఓ వృద్ధురాలు ఓటు వేసిన తర్వాత బయట కింద కూర్చుని ఉన్నది గమనించిన ఎస్పీ  వెంటనే ఆమె వద్దకు వెళ్లి కారణం అడిగారు. ఆమెకు నడవడంలో ఇబ్బంది ఉన్నట్టు తెలిసి, ఎస్పీ  స్వయంగా వీల్‌చైర్ తెప్పించి ఆమెను అందులో కూర్చోబెట్టి సహాయం చేశారు. ఈ ఆప్యాయ సహాయానికి వృద్ధురాలు ఎస్పీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. రామారెడ్డిలో  రామారెడ్డి   పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తుండగా ఒక తల్లి తన 1 సం. చిన్న పాపను ఎత్తుకుని ఓటు వేయడానికి వస్తున్నది,  గమనించిన జిల్లా ఎస్పీ  ఆమె దగ్గరకు  అంతా చిన్న పాపను తీసుకుని వచ్చి  ఓటు హక్కు వినియోగించడం నిజంగా అభినందనీయం అమ్మ తెలిపుతూ పలకరించారు.  జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు అందరూకూడా అప్రమత్తంగా పనిచేస్తున్నారని  ఎస్పీ  తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -