Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

- Advertisement -

అధ్యక్ష కార్యదర్శులుగా అజ్మత్ ఖాన్, వినోద్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ తమ సంఘానికి గుర్తింపునిచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది క్రీడాకారులను టైక్వాండో క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అదే స్ఫూర్తితో రాబోవు రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు. టైక్వాండో క్రీడారంగాభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలను నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ కు ఎల్లవేళలా అందిస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వహాజ్ అలీని ఘనంగా సత్కరించారు. ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా ఫుట్బాల్ కోచ్ జి. నాగరాజు వ్యవహరించారు. ఒలంపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ గా అబ్దుల్ ఉమర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నెట్ బాల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి. ఎస్. జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఇదే…….

 టైక్వాండో అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గంలో చైర్మన్ గా డాక్టర్ రమేష్ పవర్, అధ్యక్షునిగా మహమ్మద్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కోశాధికారిగా వినోద్, ఉపాధ్యక్షులుగా వాగ్మా రే సుభాష్, శ్యామ్, మంజునాథ్, వినోద్ రెడ్డి, రాము, సంయుక్త కార్యదర్శులుగా ప్రశాంత్ కుమార్, బుచ్చన్న, మురళి, వినోద్, ప్రవీణ్, సంతోష్ లను నూతన కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే పూర్తి కార్యవర్గాన్ని త్వరలో నియమిస్తానని అధ్యక్షుడు అజ్మత్ ఖాన్ వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad