Friday, April 3, 2026
E-PAPER
Homeఆటలుశ్రీలంక పర్యటనకు జిల్లాల జట్టు

శ్రీలంక పర్యటనకు జిల్లాల జట్టు

- Advertisement -

తొలిసారి విదేశీ పర్యటనకు హెచ్‌సీఏ జట్టు

నవతెలంగాణ-హైదరాబాద్‌ : గ్రామీణ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం, పోటీతత్వం అందించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాల క్రికెటర్లతో కూడిన జట్టు శ్రీలంకలో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ నవీన్‌ రావు సిఫారసుతో అపెక్స్‌ కౌన్సిల్‌ శ్రీలంక పర్యటనను ఖరారు చేసిందని హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శి బసవరాజు తెలిపారు.

శ్రీలంక పర్యటనకు జిల్లా జట్టు : జి. సాయి కృష్ణ (ఆదిలాబాద్‌), ఏ రుత్విక్‌ సూర్య (కరీంనగర్‌), టి. హర్షవర్దన్‌ (నిజామాబాద్‌), టివిఎస నారాయణ తేజ (ఖమ్మం), మహ్మద్‌ అఫ్రిది (మెదక్‌), మహ్మద్‌ అర్ఫాజ్‌ (మెదక్‌), వి. వైష్ణవ్‌ (వరంగల్‌), జి. పవన్‌ (వరంగల్‌), షేక్‌ అజార్‌ (ఖమ్మం), షేక్‌ అబ్దుల్‌ జీషన్‌ (నల్గొండ), టి.అరుణ్‌ కుమార్‌ (మహబూబ్‌నగర్‌), పి. లోకేశ్‌ (ఖమ్మం), డి. సాత్విక్‌ (కరీంనగర్‌), బి. భరత్‌ రెడ్డి (నల్గొండ), జి. గణేశ్‌ (మహబూబ్‌నగర్‌).

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -