హీరో శ్రీ నందు ‘సైక్ సిద్ధార్థ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్‌తో వస్తున్న దీనికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ,’కొన్నిసార్లు చిన్న సినిమాలని ఆడియెన్స్ చాలా అద్భుతంగా ధియేటర్స్‌లో ఆదరిస్తున్నారు. ‘రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్’ లాంటి కొన్ని సినిమాలకు బాగా ఆదరణ లభించింది. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ వరుణ్ చాలా డిఫరెంట్‌గా సినిమాని ప్రజెంట్ చేశాడు. సినిమాని చూసిన వెంటనే తీసుకోమని చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశారు. సినిమా బాగుంటే ఆడియన్స్ కచ్చితంగా చూస్తున్నారు.
అలాగే టికెట్ రేట్స్ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఈ సినిమా టికెట్ ధర కేవలం 99 రూపాయలు మాత్రమే’ అని తెలిపారు. ”దండోరా’లో నా నటనకి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు అది నాకు మంచి బూస్ట్ ఇచ్చింది. 31 నైట్ డల్లాస్‌లో గీత స్పెషల్ షో అరేంజ్ చేసాము. అక్కడ గీతతో పాటు స్పెషల్ చూడాలని కోరుతున్నాను. 2026 తెలుగు సినిమా సైక్ సిద్ధార్థతో ప్రారంభం కాబోతుంది. చాలా ఆనందంగా ఉంది’ అని హీరో శ్రీ నందు చెప్పారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, ‘థియేటర్స్‌కి వచ్చి గట్టిగా కేకలు వేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్‌కి ఈ సినిమా అంకితం. కనీసం 30 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా కేకలు వినిపిస్తాయి. అది మేము ప్రీమియర్స్‌లో కూడా చూసాం’ అని అన్నారు. ‘మళ్లీ సినిమాలు చేయాలనే ధైర్యం ఈ సినిమా ఇచ్చింది. జీవితంలో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నా కెరియర్‌లో ఒక సెకండ్ ఛాన్స్. ఇది న్యూ ఏజ్ ఫిలిం. అందరూ కనెక్ట్ అవుతారు’ అని హీరోయిన్ యామిని భాస్కర్ చెప్పారు.
ఆద్యంతం వైవిధ్యభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



