Wednesday, December 24, 2025
E-PAPER
Homeసినిమాఆద్యంతం వైవిధ్యభరితం

ఆద్యంతం వైవిధ్యభరితం

- Advertisement -

ఫ్యామిలీ ఎమోషనల్‌ రివేంజ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘డైమండ్‌ డెకాయిట్‌’. ప్రసాద్‌ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వినూత్నంగా హీరో పార్ధ గోపాల్‌, హీరోయిన్‌ మేఘన టీజర్‌ని టీజర్‌ రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంఆ హీరో పార్ద గోపాల్‌ మాట్లాడుతూ,’భిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం. మీ అందరి సపోర్ట్‌ కావాలి’ అని తెలిపారు. ‘డైరెక్టర్‌ సూర్య జి యాదవ్‌, హీరో, ప్రొడ్యూసర్‌ పార్ద గోపాల్‌ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నేను పోషించిన పాత్ర అందర్నీ అలరిస్తుంది’ అని హీరోయిన్‌ మేఘన చెప్పారు.
మ్యూజిక్‌ డైరెక్టర్‌ పెద్దపల్లి రోహిత్‌ మాట్లాడుతూ,’ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. కథతోపాటు సాంగ్స్‌ కూడా బాగా వచ్చాయి. టీజర్‌కి మించి ఈ సినిమా పది రెట్లు ఎక్కువగానే ఉంటుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాని కడప జిల్లాలోని అరవై లొకేషన్స్‌లో చాలా వ్యయ ప్రయాసలు పడి మా హీరో, ప్రొడ్యూసర్‌ పార్ద గోపాల్‌ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు’ అని డైరెక్టర్‌ సూర్య జి యాదవ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -