నిండు కుండను తలపిస్తున్న వైనం
నవతెలంగాణ – అశ్వారావుపేట : వర్షాకాలం వచ్చింది అంటే చాలు నివాసాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, వీధుల్లోని గుంతలలో నీరు లేకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ ప్రచారం చేస్తుంది. సిబ్బంది ఇంటింటికీ తిరిగి గృహ పరిసరాల్లోని ఖాలీ పాత్రల్లో నీటి పారబోసి, గుంతలు నీటిని లేకుండా చేస్తారు. ఎందుకంటే అలా నిల్వ ఉన్న నీటిలో దోమలు తమ లార్వా వదిలితే అది మరి కొన్ని దోమలు జన్మిస్తాయి.
అవి కుట్టిన మానవులకు మలేరియా సోకి మెదడు వాపు అనే ప్రాణాంతక వ్యాధే కాకుండా డెంగ్యూ సైతం వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ చిత్రం లో కనిపిస్తున్నది సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా అశ్వారావుపేట – బూర్గంపాడు రోడ్ లో నిర్మించిన డివైడర్. దీని నిండా నీళ్ళు చేరి నిండు కుండలా దర్శనం ఇస్తుంది. మరి ఈ నీటిని ఎవరు శుభ్రం చేయాలో మరి. ప్రస్తుతం పనులు నిర్వహించే కాంట్రాక్టర్ నా లేక ఆర్ అండ్ బీ అధికారులా లేక మున్సిపాల్టీ కార్మికులా లేక వైద్యారోగ్యశాఖ సిబ్బందా..?
దోమలకు నిలయాలుగా డివైడర్ లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES