Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజంటనగరాల ఉనికి లేకుండా జీహెచ్‌ఎంసీ వార్డుల విభజన

జంటనగరాల ఉనికి లేకుండా జీహెచ్‌ఎంసీ వార్డుల విభజన

- Advertisement -

– 17న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఆందోళన : మాజీమంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌ మహానగరాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డగోలుగా విభజిస్తున్నదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా వార్డులను విభజించారని చెప్పారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు చారిత్రక గుర్తింపు ఉందన్నారు. జంటనగరాల ఉనికి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. వార్డుల విభజనకు వ్యతిరేకంగా ఈనెల 17న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. టెక్నికల్‌ స్టడీ లేకుండా ప్రాంతాలను విభజిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్‌ చరిత్ర, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డికి ధైర్యముంటే హైదరాబాద్‌ పేరు మార్చి చూడాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకులకు కనీస అవగాహన లేదన్నారు. వార్డుల విభజనపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. ఇలాంటి ముఖ్యమంత్రి, స్పీకర్‌ను ఎప్పుడూ చూడలేదన్నారు. బీఆర్‌ఎస్‌ విప్‌ కెపి వివేకానంద మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని అన్నారు. అనుభవరాహిత్యంతో ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ విభజనపై ప్రజాపోరాటం చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -