నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హసకోత్తూర్ ప్యాట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆర్మూర్ డివిజన్ నోడల్ అధికారి పి.విజయ్ కుమార్ మంగళవారం సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థితిగతులను, మౌలిక వసతులు, తరగతుల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలను, ఎఫ్ఎల్ఎన్, ఎస్ఎల్ఎస్, బేస్ లైన్ టెస్ట్, మిడ్లిన్ టెస్ట్, ఎఫ్ఏ, ఎస్ఏ ప్రశ్న పత్రాలు, అన్ని రకాల రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు.
పాఠశాల నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఉపాధ్యాయులకు పలు సలహాలు సూచనలు చేశారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో పరిశీలన బృందం సభ్యులు రాజు, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య, ఉపాధ్యాయులు అంజాద్ సుల్తాన్, పసుపుల ప్రసాద్, సరిత, తదితరులు పాల్గొన్నారు.



