- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మంగళవారం కాటారం మండలం లోని గంగారం గ్రామ పంచాయతీ ని డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. కంపోస్ట్ ఎరువు తయారీని పరిశీలించారు.పల్లెప్రగతి పనులను పరిశీలించిన అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి బీరెల్లి కర్ణాకర్ ని ఆదేశించారు.
- Advertisement -