Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeఆటలుక్వార్టర్స్‌లో దివ్య, హంపీ

క్వార్టర్స్‌లో దివ్య, హంపీ

- Advertisement -

ఫిడె మహిళల ప్రపంచకప్‌
బటుమి (జార్జియా) :
ఫిడె మహిళల ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్‌, కోనేరు హంపీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. జార్జియాలోని బటుమిలో జరుగుతున్న మెగా ఈవెంట్‌లో శుక్రవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌లో దివ్య, హంపీ మెరుపు విజయాలు సాధించారు. రెండో సీడ్‌ చైనా జీఎం జు జినర్‌పై దివ్య 1.5-0.5తో సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ జీఎం అలెగ్జాండ్రను కోనేరు హంపీ 1.5-0.5తో ఓడించింది. మరోవైపు ద్రోణవల్లి హారిక, ఆర్‌. వైశాలి ప్రీ క్వార్టర్స్‌లో తొలి రౌండ్లో ఓటమి చెందినా.. టైబ్రేకర్‌లో రెండో గేమ్‌లో నెగ్గి రేసులో కొనసాగుతున్నారు. ఫిడె ప్రపంచకప్‌ నుంచి టాప్‌-3 గ్రాండ్‌మాస్టర్లు 2026 ఆరంభంలో జరిగే క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad