కళ్యాణం షాపింగ్ మాల్ లో స్మార్ట్ టీవీల లక్కీ డ్రా
నవతెలంగాణ-పాలకుర్తి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రజలు దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇండ్ల ముందు దీపాలను అలంకరించారు. మండల కేంద్రంలో గల కళ్యాణం షాపింగ్ మాల్ లో దసరా, దీపావళి పర్వదినాలకు పురస్కరించుకొని 3000 వరకు వస్త్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు స్మార్ట్ టీవీ కూపన్లు అందించడంతో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కళ్యాణం షాపింగ్ మాల్ యజమాని పగడాల శ్రీధర్ ఆధ్వర్యంలో షాపింగ్ మాల్ లో డ్రా నిర్వహించారు.
డ్రాలో గూడూరు గ్రామానికి చెందిన ఎండి నజీర్, పాలకుర్తి గ్రామానికి చెందిన జీడి యశశ్విక, దేవరపల్లి మండలం మాదాపురం గ్రామానికి చెందిన సతీష్, జఫర్గడ్డ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన జి రమ, స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం క చెందిన ఎం కరుణాకర్, పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన పట్టూరీ రాకేష్, ఈరవెన్ను గ్రామానికి చెందిన బిర్రు సోమన్న, ముత్తారం గ్రామానికి చెందిన ఎల్ మంజుల లు లక్కీ డ్రా లో స్మార్ట్ టీవీలను గెలుపొందారు.
లక్కీ డ్రా లో గెలుపొందిన కస్టమర్లకు షాపింగ్ మాల్ యజమాన్యం టీవీలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ షాపింగ్ మాల్ లో నాణ్యమైన వస్త్రాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. 780 మంది 3 వేలకు పైన వస్త్రాలను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి డ్రా కూపన్లను అందజేశామని తెలిపారు. డ్రాలో స్మార్ట్ టీవీలు పొందిన కస్టమర్లకు టీవీలను బహుకరించామని తెలిపారు. వస్త్రాలు కొనుగోలు చేసిన కస్టమర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా దీపావళి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES